ఏప్రిల్ 12...ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్ లో 9 స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. MI తర్వాత ఇక టేబుల్ లో ఉన్నది చెన్నై మాత్రమే. కట్ చేస్తే ఏప్రిల్ 23. అంటే 9 రోజుల గ్యాప్. ఈ 9 తొమ్మిది రోజుల గ్యాప్ లో నాలుగు మ్యాచ్ లు ఆడింది ముంబై. ఆడిన నాలుగింటిలో నాలుగూ గెలుచుకుని నిన్న టేబుల్ టాప్ 3కి చేరిపోయింది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 5 విజయాలు..4 పరాజయాలతో 10 పాయింట్లతో ప్రస్తుతం టాప్ 3లోకి దూసుకొచ్చింది. ముంబై పైనున్న ఢిల్లీ, గుజరాత్ లకు ముంబై కంటే రెండు పాయింట్లే ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక్క మ్యాచ్ తేడా మాత్రమే. ఇదీ ఈ ఐపీఎల్ లో ముంబై తన ప్లే ఆఫ్ ఆశలను కాపాడుకున్న విధానం. ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే పది రోజుల క్రితం ముంబైతో తర్వాత పదోస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికీ అదే పదో స్థానంలో ఉన్నా ముంబై మాత్రం వరుస విజయాలతో తలరాతను మార్చేసుకుంది. 2014, 15 సీజన్లలోనూ ఇలానే మ్యాజిక్ చేసింది ముంబై. ముందు వరుసగా ఐదు ఓటములు తర్వాత గేర్లు మార్చి దూసుకెళ్లి ప్లే ఆఫ్స్ లో నిలబడటం లాంటివి ముంబైకి బాగా అలవాటైన పనులే. సో ఈసారి కూడా తన ట్రెండ్ ను ఫాలో అయిన MI ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడటంతో పాటు మిగిలిన జట్లకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది.